హరితహారం లక్ష్యం 12.5 కోట్ల మొక్కలు

దిశ, న్యూస్‌బ్యూరో: ఆరో విడత హరితహారంలో 12.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెల 25నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో ముందుగా నిర్దేశించుకున్న 2.5 కోట్ల మొక్కలు కాకుండా లక్ష్యాన్ని మార్చారు. బుధవారం మున్సిపల్​ డైరెక్టర్​ సత్యనారాయణతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, అన్ని మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 6నెలల్లో పట్టణ స్థానిక సంస్థల […]

Update: 2020-06-17 08:35 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఆరో విడత హరితహారంలో 12.5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈనెల 25నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో ముందుగా నిర్దేశించుకున్న 2.5 కోట్ల మొక్కలు కాకుండా లక్ష్యాన్ని మార్చారు. బుధవారం మున్సిపల్​ డైరెక్టర్​ సత్యనారాయణతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, అన్ని మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 6నెలల్లో పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 500 యాదాద్రి మోడల్​ ప్లాంటేషన్​ పార్కులు, 700 ట్రీ పార్కులు ప్రజానీకానికి అందుబాటులో ఉండాలన్నారు. మూడు, నాలుగు నెలల్లో పట్టణ ప్రాంతాలు పచ్చదనంతో ప్రఢవిల్లే విధంగా మియావాకి నమూనాలో యాదాద్రి మోడల్​ ప్లాంటేషన్​ చేపట్టాలని, మున్సిపాలిటీల్లో ట్రీ పార్కులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హెచ్​ఎండీఏ పరిధిలో 5కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ పరిధిలో రెండున్నర కోట్ల మొక్కలు, సీడీఎంఏ(మున్సిపాలిటీలు) పరిధిలో 5కోట్ల మొక్కల చొప్పున లక్ష్యాన్ని విధించారు. హరితహారంలో తక్కువ కాలంలో ఎక్కువ గ్రీనరీకి అవకాశం కల్పించే మియావాకి​, ట్రీ పార్కులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్వారీలు, డంప్​ యార్డుల చుట్టూ ‘కీ రోల్​’ పద్ధతిలో గ్రీనరీ పెంపకాన్ని చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో మున్సిపల్​ శాఖ కార్యదర్శి సుదర్శన్​రెడ్డి, హెచ్ఎండిఏ అర్బన్​ ఫారెస్ట్రీ డైరెక్టర్​ శ్రీనివాస్​, హెచ్ఎండీఏ ప్లానింగ్​ డైరెక్టర్లు బాలకృష్ణ, శివశరణప్ప, సిడిఎంఏ అడిషనల్​ డైరెక్టర్​ పంకజం, జీహెచ్ఎంసీ అడిషనల్​ కమిషనర్​(బయో డైవర్సిటీ) కృష్ణ, జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News