ఫీజుల కోసం యాజమాన్యం వేధింపులు..

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తోంది. ఐదు రోజులుగా పదవతరగతి మెమోలు ఇవ్వకుండా ఫీజు చెల్లించాల్సిదేనని హుకూం జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మారెడుగు గ్రామానికి చెందిన జయ్ ప్రకాష్, సంపత్ వర్మ లు అచ్చంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో గత ఏడాది పదో తరగతి పాసయ్యారు. విద్యార్థులు తమ మెమోలు ఇవ్వాలని పాఠశాలకు వెళ్లగా […]

Update: 2021-11-22 20:36 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తోంది. ఐదు రోజులుగా పదవతరగతి మెమోలు ఇవ్వకుండా ఫీజు చెల్లించాల్సిదేనని హుకూం జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మారెడుగు గ్రామానికి చెందిన జయ్ ప్రకాష్, సంపత్ వర్మ లు అచ్చంపేట పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో గత ఏడాది పదో తరగతి పాసయ్యారు.

విద్యార్థులు తమ మెమోలు ఇవ్వాలని పాఠశాలకు వెళ్లగా అదనపు ఫీజు చెల్లిస్తేనే మెమోలు ఇస్తామని యాజమాన్యం తెలిపింది. ఎలాంటి రశీదులు ఇవ్వకుండా పాఠశాల యాజమాన్యం మూడురోజులు పాటు తిప్పించుకుంది. దాంతో మెమోల కోసం విద్యార్థుల తండ్రి, ఏబివిపి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మీడియా ప్రతినిధులు అక్కడికి రావడంతో యాజమన్యం మెమోలు ఇచ్చిపంపింది.

Tags:    

Similar News