సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉమ్రా తీర్థయాత్రకు వారే అర్హులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతూ.. ప్రపంచ దేశాలకు వణుకుపుట్టిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సౌదీ ప్రభుత్వం సైతం ఓ సంచలన ప్రకటన చేసింది. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రంజాన్ మాసం మొదలైన నాటి నుంచి ఇమ్యూనిటీ కలిగి ఉన్న వారు మాత్రమే ఉమ్రా తీర్థయాత్ర చేసేందుకు అనుమతి […]

Update: 2021-04-05 20:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతూ.. ప్రపంచ దేశాలకు వణుకుపుట్టిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సౌదీ ప్రభుత్వం సైతం ఓ సంచలన ప్రకటన చేసింది. వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రంజాన్ మాసం మొదలైన నాటి నుంచి ఇమ్యూనిటీ కలిగి ఉన్న వారు మాత్రమే ఉమ్రా తీర్థయాత్ర చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ రెండు డోస్‌లు తీసుకున్నవారు, గడిచిన 14 రోజుల్లో ఒక డోస్ తీసుకున్న వారు లేదా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు మాత్రమే ఉమ్రా చేసేందుకు అనుమతి అని తెలిపింది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. హజ్ యాత్ర వరకు ఇవే ఆంక్షలు కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News