గజ్వేల్ సభలో దొంగల చేతివాటం..
దిశ ప్రతినిధి, మెదక్ : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన సభలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతున్న సమయంలో ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు సీఎం పై విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రజలు సంతోషం లో ఉన్న సమయాన్ని అదునుగా భావించిన దొంగలు తమ చేతులకు పనిజెప్పారు. సీఎం స్వంత జిల్లా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో […]
దిశ ప్రతినిధి, మెదక్ : టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన సభలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతున్న సమయంలో ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు సీఎం పై విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రజలు సంతోషం లో ఉన్న సమయాన్ని అదునుగా భావించిన దొంగలు తమ చేతులకు పనిజెప్పారు. సీఎం స్వంత జిల్లా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభ పేరిట కాంగ్రస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభకు భారీగా జనం హజరయ్యారు. గజ్వేల్ సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా. దీన్ని ఆసరాగా చేసుకున్న జేబు దొంగలు మీటింగ్ లోకి చొరబడి కాంగ్రెస్ కార్యకర్తలు, సామాన్య ప్రజల జేబుల జేబులు కొట్టారు. అలాగే అక్కడ ఉన్న కొందరి పర్సులు, సెల్‌ఫోన్లు, మెడలో నుండి బంగారు చైనులను సైతం కొట్టేసినట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.