దారుణం.. బాలిక పై తొమ్మిది రోజుల సామూహిక అత్యాచారం..
దిశ, వెబ్ డెస్క్: ఇంటి దగ్గర ఉన్న బాలికను నమ్మించి అపహరించింది ఓ మహిళ. అక్కడితో ఆగకుండా కొంత సొమ్ముకు బాలికను అమ్మేసింది. కొనుగోలు చేసిన యువకులు ఆ బాలిక పై తొమ్మిది రోజులు సామూహికంగా అత్యాచారం చేశారు. పైశాచికంగా ప్రవర్తిస్తూ నరకం చూపించారు. ఎలాగోలా బయటపడిన బాలికను స్థానికులు తన స్వంత గ్రామానికి చేర్చారు. కోటా జిల్లా సుకేత్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు […]
దిశ, వెబ్ డెస్క్: ఇంటి దగ్గర ఉన్న బాలికను నమ్మించి అపహరించింది ఓ మహిళ. అక్కడితో ఆగకుండా కొంత సొమ్ముకు బాలికను అమ్మేసింది. కొనుగోలు చేసిన యువకులు ఆ బాలిక పై తొమ్మిది రోజులు సామూహికంగా అత్యాచారం చేశారు. పైశాచికంగా ప్రవర్తిస్తూ నరకం చూపించారు. ఎలాగోలా బయటపడిన బాలికను స్థానికులు తన స్వంత గ్రామానికి చేర్చారు. కోటా జిల్లా సుకేత్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 6 న కేసు నమోదు కాగా పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు.
సుమారు 15 ఏళ్ల వయసు ఉండే బాలికను అపహరించిన పూజ్ జైన్ అనే మహిళ ఝలావర్ లో అమ్మేసింది. కొనుగోలు చేసిన యువకులు సుమారు తొమ్మిది రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసినట్టు విచారణ లో తేలింది. సామూహిక అత్యాచారం చేసిన 13 మందికి రాజస్తాన్ కోర్టు ఏకంటా 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరికి నాటుగేళ్ల పాటు సాదారణ శిక్ష విధించింది. అనుమానితులుగా పట్టుబడిన 12 మందిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. అమ్మిన మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.