మామను హత్య చేసిన అల్లుడు అరెస్ట్

దిశ, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ప్రాంగణం వద్ద జరిగిన హత్య కేసును ఛేదించి, నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన చింతల గోపి తరచూ భార్యతో గొడవ పడి, విచక్షణారహితంగా కొడుతుండేవాడు. విషయం తెలిసిన గోపి మామ వెంకటేశ్వర్లు తన కూతురుని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించాడు. […]

Update: 2020-06-24 07:02 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ప్రాంగణం వద్ద జరిగిన హత్య కేసును ఛేదించి, నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన చింతల గోపి తరచూ భార్యతో గొడవ పడి, విచక్షణారహితంగా కొడుతుండేవాడు. విషయం తెలిసిన గోపి మామ వెంకటేశ్వర్లు తన కూతురుని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన గోపి మామ వెంకటేశ్వర్లు తలపై రోకలిబండతో తలపై మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుమారుడు ప్రకాష్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బుధవారం నిందితుడు గోపిని అదుపులోకి తీసుకొని, రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో సమర్థవంతంగా విచారణ చేసి కేవలం మూడు రోజుల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ నిగిడాల సురేష్, క్రైమ్ సిబ్బంది రాము, రాజు, షకీల్, శ్రీనివాస్, రైటర్ శ్రీనివాస్ తదితరులను డీఎస్పీ అభినందించారు.

Tags:    

Similar News