అస్సలు ఓడిపోవద్దు అని నాన్న చెప్పేవాడు

దిశ, వెబ్‌డెస్క్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ తండ్రి గత శుక్రవారం చనిపోయారు. అయినా సరే తర్వాతి రోజు హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడాడు. సోమవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌ను మన్‌దీప్ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్టు చెప్పాడు. ‘బ్యాటింగ్ చేసే ప్రతీసారి అజేయంగా నిలబడు.. అస్సలు ఓడిపోవద్దు అని మా నాన్న చెప్పేవాడు. ఇవాళ నేను అజేయంగా నిలబడి మ్యాచ్ […]

Update: 2020-10-26 21:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ తండ్రి గత శుక్రవారం చనిపోయారు. అయినా సరే తర్వాతి రోజు హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడాడు. సోమవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌ను మన్‌దీప్ తన తండ్రికి అంకితం ఇస్తున్నట్టు చెప్పాడు. ‘బ్యాటింగ్ చేసే ప్రతీసారి అజేయంగా నిలబడు.. అస్సలు ఓడిపోవద్దు అని మా నాన్న చెప్పేవాడు. ఇవాళ నేను అజేయంగా నిలబడి మ్యాచ్ గెలుపులో కీలకంగా ఉన్నాను. అందుకే ఈ ఇన్నింగ్స్ ఆయనకు అంకితం ఇస్తున్నాను’ అని మన్‌దీప్ చెప్పాడు.

కాగా మన్‌దీప్ తండ్రి ఆరోగ్యం గత కొంత కాలంగా బాగోలేదు. గత వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. శుక్రవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో మన్‌దీప్ తండ్రి మరణానికి సంతాప సూచికగా.. పంజాబ్ ఆటగాళ్లు చేతికి నల్లటి రిబ్బన్లు కట్టుకొని మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌‌కు మయాంక్ అగర్వాల్ దూరం కావడంతో.. అతడి స్థానంలో ఓపెనర్‌గా ఆడిన మన్‌దీప్ సింగ్ బరిలోకి దిగారు.

Tags:    

Similar News