రోజుల వ్యవధిలోనే ఆక్స్‌ఫర్డ్ టీకాకు అనుమతి: సీరం

న్యూఢిల్లీ: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకాకు రోజుల వ్యవధిలోనే అనుమతి లభించే అవకాశమున్నదని పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. జనవరిలో తమ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ చివరిలోపు లేదా వచ్చే నెల తొలివారంలో ఆక్స్‌ఫర్డ్ టీకాకు యూకే రెగ్యులేటరీ అత్యవసర అనుమతినిచ్చే అవకాశముందని, భారత ప్రభుత్వమూ కొవిషీల్డ్‌కు మరికొన్ని రోజుల్లో అనుమతినిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. డ్రగ్ రెగ్యులేటరీ ప్రక్రియను గౌరవిస్తామని, టీకాల డేటా రివ్యూకు వాటికి […]

Update: 2020-12-28 11:55 GMT

న్యూఢిల్లీ: భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకాకు రోజుల వ్యవధిలోనే అనుమతి లభించే అవకాశమున్నదని పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. జనవరిలో తమ టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ చివరిలోపు లేదా వచ్చే నెల తొలివారంలో ఆక్స్‌ఫర్డ్ టీకాకు యూకే రెగ్యులేటరీ అత్యవసర అనుమతినిచ్చే అవకాశముందని, భారత ప్రభుత్వమూ కొవిషీల్డ్‌కు మరికొన్ని రోజుల్లో అనుమతినిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. డ్రగ్ రెగ్యులేటరీ ప్రక్రియను గౌరవిస్తామని, టీకాల డేటా రివ్యూకు వాటికి సరిపడా సమయమిస్తామని వివరించారు. సేఫ్టీపై రాజీపడబోమని, వచ్చే ఏడాదిలో గుడ్ న్యూస్ వింటామన్న ఆశాభావాన్ని ప్రకటించారు.

Tags:    

Similar News