కల్లు దొరకక… వృద్ధుడు మృతి
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని న్యూ మార్కెట్ యార్డు సమీపంలో ఈరోజు ఉదయం గుర్తుతెలియని ఓ వృద్దుడు(65) మృతి చెందిన విషయం విదితమే. అయితే చనిపోయిన వృద్ధుడు పట్టణంలోని పద్మావతి కాలనీకి చెందిన విష్ణుమూర్తి అని పోలీసుల విచారణలో తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఫోటోను గుర్తించిన కుటుంబసభ్యులకు వివరాలు చెప్పారు. విష్ణుమూర్తికి ఒక భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వీరు పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు. విష్ణుమూర్తికి గత కొంతకాలంగా […]
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని న్యూ మార్కెట్ యార్డు సమీపంలో ఈరోజు ఉదయం గుర్తుతెలియని ఓ వృద్దుడు(65) మృతి చెందిన విషయం విదితమే. అయితే చనిపోయిన వృద్ధుడు పట్టణంలోని పద్మావతి కాలనీకి చెందిన విష్ణుమూర్తి అని పోలీసుల విచారణలో తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఫోటోను గుర్తించిన కుటుంబసభ్యులకు వివరాలు చెప్పారు. విష్ణుమూర్తికి ఒక భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. వీరు పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నారు. విష్ణుమూర్తికి గత కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అదేవిధంగా మృతుడు విష్ణుమూర్తికి బాగా కల్లు తాగే అలవాటు ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది కల్లు దొరకక మానసిక ప్రవర్తన చెదిరి వింతగా ప్రవర్తిస్తూ, బయటికి వెళ్ళిపోతున్నారు. విష్ణుమూర్తి మృతి కూడా ఇదే కోణంలో చోటు చేసుకోవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి విషయాన్ని స్థానికులు ఎస్ఐ విజయ భాస్కర్ కు సమాచారం అందజేశారు.
tags : old man, dead, lockdown, rangareddy, wine