టీటీడీ మరో కీలక నిర్ణయం..ఇక నుంచి భక్తులకు ఇబ్బందులే

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు నివేదికలు కూడా ఉన్నాయని ఈ నేపథ్యంలోనే స్వామి వారి దర్శనాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. దేశీయ ఆవులతో నెయ్యిని తయారు చేసి స్వామివారి నైవేద్యాలకు, దీపారాధనకు వినియోగిస్తామన్నారు. తిరుమలలోనే దేశీయ ఆవు […]

Update: 2021-07-23 05:19 GMT

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు నివేదికలు కూడా ఉన్నాయని ఈ నేపథ్యంలోనే స్వామి వారి దర్శనాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామన్నారు. దేశీయ ఆవులతో నెయ్యిని తయారు చేసి స్వామివారి నైవేద్యాలకు, దీపారాధనకు వినియోగిస్తామన్నారు. తిరుమలలోనే దేశీయ ఆవు నెయ్యి తయారు చేస్తామని పేర్కొన్నారు.

టీటీడీ మరో కీలక నిర్ణయం..తిరుమల కొండపై ఉద్యానవనాలు

టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచాలని నిర్ణయించింది. శ్రీవారికి వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించేలా నూతన పుష్ప ఉద్యాన‌వ‌నాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1.5 కోట్లతో తిరుమ‌ల క్షేత్ర పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీ‌వారి పుష్ప కైంక‌ర్యానికి వినియోగించే ‌మొక్క‌లతో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశారు. దాత‌ల స‌హకారంతో గార్డెన్ విభాగం ఐదు ఎక‌రాల విస్తీర్ణంలో ఈ ఉద్యాన‌వ‌నాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సంప్ర‌దాయ పుష్పాలైన చామంతి, వృక్షి, రోజ, మ‌ధురై మ‌ల్లెలు, క‌న‌కాంబ‌రం, మాను సంపంగి, లిల్లీలు, తుల‌సి, ప‌న్నీరు ఆకు వంటి మెుక్కలను నాటారు. ఈ పుష్పాలను ఏప్రిల్‌, మే నెల‌ల నుండి శ్రీ‌వారి కైంక‌ర్యాల‌కు వినియోగించ‌నున్నారు. అలాగే గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద శ్రీ వేంకటేశ్వర శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. భవిష్యత్‌లో ఈ ఉద్యానవనాలను మరింత పెంచుతామని టీటీడీపీ స్పష్టం చేసింది.

పుష్పాలతో అగరబత్తీల తయారీ

ఆలయాల్లో వినియోగించే పుష్పాలతో అగరబత్తీలు తయారు చేసి విక్రయించాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే అగర బత్తీల తయారీకి చర్యలు తీసుకుంటామని ఈవో వెల్లడించారు. అగరబత్తీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగిస్తామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News