కాకినాడలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ(Kakinada)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శంఖవరం మండలం పెద్దమల్లాపురం వద్ద చెట్టు(Tree)ను బైక్(Byke) ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెళ్తున్న ఇద్దరు యువకులు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై స్థానికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అతివేగంగా బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో చలాకీగా కనిపించే యువకులు ఇకలేరని తెలిసి మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. తల్లిదండ్రుల శోకాన్ని చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.