MLA:గుంతలు లేని రహదారులను నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

గుంతలు లేని రహదారులను సంక్రాంతి పండుగ వచ్చే ముందు ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.

Update: 2024-12-26 11:06 GMT

దిశ, కొత్తపేట: గుంతలు లేని రహదారులను సంక్రాంతి పండుగ వచ్చే ముందు ప్రయాణికులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ నుంచి వెదురుమూడి రహదారి మరమ్మతు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేతకాని పాలనతో రహదారులు అధ్వానంగా మారాయని అన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మన ప్రజా ప్రభుత్వం ఐనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ తక్షణం ప్రజా రవాణాకు గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆ దిశగా పనులు వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు. సంక్రాంతి పండుగకు ముందుగా గుంతలు లేని రోడ్లను ప్రయాణికులకు అందిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News