నుమాయిష్‌పై కరోనా నీడలు
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గ్రేటర్‌లో ప్రతి సంవత్సరం జరిగే నుమాయిష్ పై కరోనా ప్రభావం పడింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80 అఖిల భారత ప్రదర్శన (ఎగ్జిబిషన్)లు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం 2021 జనవరి 1 నుండి 81వ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు మొదలు కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సారి ఎగ్జిబిషన్ వాయిదా పడింది. కోవిడ్ -19 కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా తిరిగే పరిస్థితి లేనప్పటికీ అక్టోబర్ 10న ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: గ్రేటర్‌లో ప్రతి సంవత్సరం జరిగే నుమాయిష్ పై కరోనా ప్రభావం పడింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80 అఖిల భారత ప్రదర్శన (ఎగ్జిబిషన్)లు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం 2021 జనవరి 1 నుండి 81వ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు మొదలు కావలసి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సారి ఎగ్జిబిషన్ వాయిదా పడింది. కోవిడ్ -19 కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా తిరిగే పరిస్థితి లేనప్పటికీ అక్టోబర్ 10న ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల ఏర్పాటుకు ఎగ్జిబిషన్ సొసైటీ పాలకవర్గం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 81వ నుమాయిష్‌లో స్టాళ్లు ఏర్పాటుచేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఐతే దీనిని వ్యతిరేకిస్తూ హై కోర్టు న్యాయవాది ఎజాజుద్ధిన్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఓ లేఖ రాశారు. 46 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ ప్రదర్శనలో భాగంగా నిత్యం 40 వేల మంది సందర్శకులు నుమాయిష్‌కు వస్తారని, దీంతో కరోనా మరింత పెరిగి పోయి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నందున అనుమతినివ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అనుమతినిస్తే తాను సుప్రింకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు . ఆయన లేఖకు స్పందించిన జిల్లా కలెక్టర్.. 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేశారు.