ఇక్కడ కాంట్రాక్టరుదే ఇష్టారాజ్యం…
దిశ,మానకొండూరు: కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్మాణం పనులు జరుగుతున్నాయని గద్దపాక గ్రామ సర్పంచ్ గోపి విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆశీర్వాదంతో మండలంలోని కేశవపట్నం వాగుపై రూ.11లక్షల 35వేల నిధులతో రైతులకు సాగునీరు అందించేందుకు కేశవపట్నం, అర్కండ్ల, గద్దపాక వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణం కోసం స్వర్ణ కన్స్ట్రక్షన్ సంస్థకు నిర్మాణం పనులను అప్పగించారన్నారు. అయితే సదరు కాంట్రాక్టర్ […]
దిశ,మానకొండూరు: కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్మాణం పనులు జరుగుతున్నాయని గద్దపాక గ్రామ సర్పంచ్ గోపి విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆశీర్వాదంతో మండలంలోని కేశవపట్నం వాగుపై రూ.11లక్షల 35వేల నిధులతో రైతులకు సాగునీరు అందించేందుకు కేశవపట్నం, అర్కండ్ల, గద్దపాక వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణం కోసం స్వర్ణ కన్స్ట్రక్షన్ సంస్థకు నిర్మాణం పనులను అప్పగించారన్నారు.
అయితే సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా, నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకంగా పనులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. అలానే ప్రభుత్వ నిధులను నీటిపాలుకాకుండా ఉండేందుకు కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకొని, పనులను నాణ్యతతో చేయించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సోమిడి తిరుపతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.