రామమందిరానికి మొగల్ వారసుడు బంగారు ఇటుక గిఫ్డ్

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరానికి భూమి పూజ ఆగస్టు 5న ముహూర్తం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక మందిర నిర్మాణానికి భారీగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో గుడి నిర్మాణంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ నిర్మాణం కోసం హిందువులే కాకుండా ఇతర మతస్తులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా అయోధ్య రామమందిరానికి తన వంతుగా బంగారు ఇటుకను అందజేస్తానని మొగల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ […]

Update: 2020-07-27 07:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరానికి భూమి పూజ ఆగస్టు 5న ముహూర్తం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక మందిర నిర్మాణానికి భారీగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో గుడి నిర్మాణంపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

ఈ నిర్మాణం కోసం హిందువులే కాకుండా ఇతర మతస్తులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా అయోధ్య రామమందిరానికి తన వంతుగా బంగారు ఇటుకను అందజేస్తానని మొగల్ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ ప్రకటించారు. కేజి బంగారాన్ని ఇటుక రూపంలో తయారు చేసి ప్రధాని మోదీకి ఇస్తానని.. ఆ ఇటుక రామ మందిర నిర్మాణంలో వినియోగించాలని సూచించారు. అలాగే, ప్రధాని మోదని కలిసేందకు ఓ అవకాశం కూడా ఇవ్వాలని మొగల్ వారసుడు కోరారు.

Tags:    

Similar News