ఆడ బిడ్డను కన్నది.. వదిలించుకోవాలని చూసింది.. కానీ
దిశ, పటాన్‌చెరు: నవ మాసాలు మోసి బిడ్డను కన్న ఓ తల్లి వదిలించుకుని వెళ్లిపోదామని ప్రయత్నించింది. ఈ సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన ఎం.బుల్లి కి మహారాష్ట్రకు చెందిన నగేష్ తో గత ఏడాది క్రితం విహాహం జరిగింది. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు వలస వచ్చి జీవనం సాగిస్తుండగా, రెండు నెలల క్రితం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు […]
దిశ, పటాన్‌చెరు: నవ మాసాలు మోసి బిడ్డను కన్న ఓ తల్లి వదిలించుకుని వెళ్లిపోదామని ప్రయత్నించింది. ఈ సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన ఎం.బుల్లి కి మహారాష్ట్రకు చెందిన నగేష్ తో గత ఏడాది క్రితం విహాహం జరిగింది. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడకు వలస వచ్చి జీవనం సాగిస్తుండగా, రెండు నెలల క్రితం మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగేష్ మృతి చెందాడు. నెలలు నిండిన గర్భవతి అయిన బుల్లి శనివారం లింగంపల్లిలో బస్ కోసం నిలబడింది.
పురిటి నొప్పులు రావడంతో పక్కనే ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లిన ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అక్కడున్న కొంతమంది వెళ్లి చూసే సరికి బుల్లి అప్పుడే పుట్టిన శిశువును కిటికిలోంచి బయట పడేసేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో బుల్లి, శిశువును ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. తనకు ఆ బిడ్డ అవసరం లేదని, తనకొద్దంటూ తల్లి మారాం చేయడంతో పోలీసులు బుల్లి, శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.