ఆ మందు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, శేరిలింగంపల్లి: తాగితేనే కాదు.. రేట్ విన్న కిక్ ఎక్కే మద్యం అందుబాటులో ఉంది. మందుబాబుల్లో చాలామందికి చీప్ లిక్కర్ నుంచి మొదలు సిగ్నిచర్స్, టీచర్స్, బ్లాక్ డాగ్ మందుల వరకు తెలుసు. కానీ అంతకు మించిన వెరైటీల్లో మద్యం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. మహానగరంలోని కొన్ని మాల్స్‌లో ఏర్పాటు చేసిన వైన్స్ షాపుల్లో అత్యధిక ధరకు అమ్ముడు పోయే మందులున్నాయి. వాటిలో చివాస్ రీగల్ 25 ఏళ్ల ఓల్డ్ వెర్షన్ 700 ఎంఎల్ విస్కీ […]
దిశ, శేరిలింగంపల్లి: తాగితేనే కాదు.. రేట్ విన్న కిక్ ఎక్కే మద్యం అందుబాటులో ఉంది. మందుబాబుల్లో చాలామందికి చీప్ లిక్కర్ నుంచి మొదలు సిగ్నిచర్స్, టీచర్స్, బ్లాక్ డాగ్ మందుల వరకు తెలుసు. కానీ అంతకు మించిన వెరైటీల్లో మద్యం కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. మహానగరంలోని కొన్ని మాల్స్‌లో ఏర్పాటు చేసిన వైన్స్ షాపుల్లో అత్యధిక ధరకు అమ్ముడు పోయే మందులున్నాయి. వాటిలో చివాస్ రీగల్ 25 ఏళ్ల ఓల్డ్ వెర్షన్ 700 ఎంఎల్ విస్కీ ధర రూ.32,865. అవునూ మీరు చదివింది నిజమే.
అక్షరాల ముప్పై రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు. అదీ జస్ట్ 700 మిల్లీ లీటర్ల మందు ధర. అలాగే మరో బ్రాండ్ జానీ వాకర్ బ్లూ లేబుల్ స్కాచ్ 750 ఎంఎల్ రూ.23,040 ఉంది. ది గ్లిన్ లై వెట్ సింగిల్ మాల్ట్ 21 ఏళ్ల ఓల్డ్ స్కాచ్ ధర రూ. 25, 250. గ్లెన్ ఫీడిచ్ 18 ఏళ్ల ఓల్డ్ స్కాచ్ ధర రూ.11,810గా ఉంది. ఇలా బ్రాండ్, ఇయర్‌ను బట్టి ధరల్లో తేడాలున్నాయి. అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా తదితర దేశాల నుంచి ఇంపోర్ట్ అయిన వైన్, బీర్లకు సైతం ఫుల్ డిమాండ్ ఉంది. ధరలకు ఏమాత్రం వెనకాడకుండా మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. హాయిగా తాగేస్తున్నారు.
ఎన్నెన్నో రకాలు
మద్యం ప్రియులు ఒక్కొక్కరూ ఒక్కో బ్రాండ్ మద్యాన్ని ఎంచుకుంటారు. రెగ్యులర్ గా అదే తాగుతూ ఉంటారు. ఎప్పుడో ఓసారి, ఆ బ్రాండ్ దొరకకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బ్రాండ్ చేంజ్ చేస్తారు. లేదంటే మాత్రం ఒకే బ్రాండ్. మద్యంలోనూ బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, జీన్, వైన్ ఇలా అనేక రకాలున్నాయి. వాటి కాస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. తాగేది బీర్ అయినా అందులో పదుల రకాల కంపెనీలు, ఆల్కహాల్ పర్సంటేజ్ ల్లో తేడాలు ఉంటాయి.
అలాగే, రమ్, జీన్, విస్కీల్లోనూ ఆయా కంపెనీలు, బ్రాండ్స్ తేడాలున్నాయి. ఇవేగాక వైన్ లాంటి కాస్త సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ శాతం చాలా తక్కువ మొత్తంలో ఉన్నవి కూడా ధరల్లో తేడాలుంటాయి. అలాగే మద్యం తయారీ సంవత్సరాన్ని బట్టి, అది నిల్వ ఉన్న రోజులను బట్టి కూడా ధరలు మారిపోతూ ఉంటాయి. అదే సంవత్సరం తయారైన మద్యానికి తక్కువ ధర పలికితే, ఏళ్లు పెరిగిన కొద్దీ ధరలు సైతం అమాంతం పెరుగుతూ ఉంటాయి. వీటి ఎంపిక విషయాల్లో ఒక్కోరిది ఒక్కో టేస్ట్.
ధరలను బట్టి మందుల్లో తేడా..
మందుబాబులం.. మేము మందుబాబులం అంటూ మద్యం ప్రియుల్లో చాలామంది రోజు ఫుల్‌గా మద్యం తాగేస్తుంటారు. ఎంత తాగినా కొందరు కంట్రోల్లోనే ఉంటుండగా.. ఇంకొందరు మాత్రం కొంచెం తాగినా నానా రభసా చేస్తుంటారు. ఇదంతా ఆయా వ్యక్తుల బాడీ మీదనే కాదు.. వారు తాగే బ్రాండ్ మందుల్లో ఉండే ఆల్కహాల్ పర్సంటేజ్, దాని తయారీ, ధరల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మందుకొట్టి రోడ్డుపై అటు ఇటూ తూలుతూ ఉంటే చీప్ లిక్కర్ తాగినట్టు ఉంది. అందుకే అలా తూలుతున్నాడు అనడం కామన్ గా వింటూనే ఉంటాం. వాస్తవానికి తక్కువ ధరల మద్యంలో ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది అంటున్నారు నిపుణులు. తయారీ విధానంలోనూ తేడాలుంటాయి. అందుకే చీప్ లిక్కర్ తాగితే బాగా కిక్కు ఎక్కడమే కాదు, అది కుదురుగా ఉండనివ్వదు అని చెబుతున్నారు. ఈ మద్యాన్ని తాగడం వల్ల అనారోగ్యం బారినపడడం ఖాయమట, దీర్ఘకాలంలో పలు రోగాలు వస్తాయని అంటున్నారు.