భూచరిత్రలో అత్యంత డేంజరస్ ప్రదేశం ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: వంద మిలియన్ సంవత్సరాల క్రితం క్రూరమైన డైనోసార్లు, మొసళ్ల లాంటి జంతువులతో నిండి సహారా ప్రాంతం మానవాళి చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. మొరాకోలోని కెమ్ కెమ్ గ్రూప్ దగ్గరి అవశేషాల మీద పరిశోధన చేస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు. ఆఫ్రికాలో డైనోసార్ల సంచార సమయం నాటి విషయాలు తెలుసుకునేందుకు వీరు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల టీమ్‌కి సారథి అయిన డెట్రాయిట్ మెర్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ […]
దిశ, వెబ్‌డెస్క్:
వంద మిలియన్ సంవత్సరాల క్రితం క్రూరమైన డైనోసార్లు, మొసళ్ల లాంటి జంతువులతో నిండి సహారా ప్రాంతం మానవాళి చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. మొరాకోలోని కెమ్ కెమ్ గ్రూప్ దగ్గరి అవశేషాల మీద పరిశోధన చేస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు. ఆఫ్రికాలో డైనోసార్ల సంచార సమయం నాటి విషయాలు తెలుసుకునేందుకు వీరు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు.
ఈ శాస్త్రవేత్తల టీమ్‌కి సారథి అయిన డెట్రాయిట్ మెర్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం వందేళ్ల క్రితం నాటి పరిస్థితుల గురించి జర్నల్ ప్రచురించారు. సహారాలో ఒకప్పుడు నది ఉండేదని, ఆ నది నీళ్ల కోసం వచ్చి పెద్ద పెద్ద పళ్లు ఉండే డైనోసార్లు అక్కడే నివాసం ఉండేవని, నీటి కోసం ఈ జంతువుల మధ్య ప్రమాదకర పోరాటాలు జరిగేవని చెప్పారు. దీంతో అక్కడి ఇతర జంతువులకు ప్రమాదాలు జరిగేవని అందుకే తాము ఈ ప్రాంతాన్ని భూచరిత్రలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశంగా పరిగణిస్తున్నట్లు వివరించారు.
Tags: morroco, Africa, paleontologist most dangerous place, journal