అక్కడ త్రిముఖం.. ఇక్కడ వన్ టూ వన్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పట్టభద్రుల ఓటర్ల నాడి ఇప్పుడిప్పుడే అంతు చిక్కుతోంది. పోటీలోని అభ్యర్థులు ఖారారయినప్పటి నుంచి స్పష్టంగా అంచనా వేసేందుకు కూడా సాహాసం చేయలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ నలుగురి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ప్రధాన పోటీ దారులుగా ఉంటారని అందరూ భావించారు. అయితే ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ బాక్స్‌ల్లో తమ ప్రాధాన్యతలను ప్రకటించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి నల్లగొండ- వరంగల్- ఖమ్మం స్థానంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పట్టభద్రుల ఓటర్ల నాడి ఇప్పుడిప్పుడే అంతు చిక్కుతోంది. పోటీలోని అభ్యర్థులు ఖారారయినప్పటి నుంచి స్పష్టంగా అంచనా వేసేందుకు కూడా సాహాసం చేయలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ నలుగురి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ప్రధాన పోటీ దారులుగా ఉంటారని అందరూ భావించారు. అయితే ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ బాక్స్‌ల్లో తమ ప్రాధాన్యతలను ప్రకటించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి నల్లగొండ- వరంగల్- ఖమ్మం స్థానంలో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానంలో రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాయి. నల్లగొండ స్థానంలో త్రిముఖ పోరు, హైదరాబాద్ స్థానంలో వన్ టూ వన్ పోటీ కనిపిస్తోంది. పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణిదేవి మొదటి ప్రాధాన్యత ఓట్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
అయితే హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుతోనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇక్కడ గట్టి పోటీనివ్వడంతో పాటు గెలుస్తారన్న అంచనాలు ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటున్నారు. అయితే మూడో స్థానంలోని నాగేశ్వర్ రెండో స్థానంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. రెండో స్థానంలోని బీజేపీకి 32,558 ఓట్లు రాగా.. ప్రొఫెసర్ నాగేశ్వర్ దాదాపు సగం 15,607 ఓట్లతో తేడాతో 16,951 కొనసాగుతున్నారు. ఇక నల్లగొండ స్థానంలో ప్రధాన పోటీ టీఆర్ఎస్‌తో పాటు తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అభ్యర్థి కోదండరాం మధ్యే కనిపిస్తోంది. రెండో స్థానంలోని తీన్మార్ మల్లన్నకు 34,864 ఓట్లు రాగా.. మూడో స్థానంలో కోదండరాం 29,560 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రధానంగా పోటీలో నిలుస్తారనుకున్న చెరకు సుధాకర్, రాణి రుద్రమ, వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డిలు ప్రధాన పోటీలో కనిపించడం లేదు.