‘డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన లేదు’
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, ఆవశ్యకతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కారించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, ఆవశ్యకతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కారించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు అని అన్నారు. ఈ సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి హాజరయ్యారు.