'కష్ట కాలంలోనూ నిరాటంకంగా కొనసాగుతున్నాయి'
దిశ, వరంగల్: రాష్ట్రంలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ హన్మకొండ లోని అమరుల స్థూపం వద్ద అమర వీరులకు ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సీఎం నాటి ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో అనేక మంది పోరాటాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిందన్నారు. సీఎం కేసీఆర్ […]
దిశ, వరంగల్: రాష్ట్రంలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ హన్మకొండ లోని అమరుల స్థూపం వద్ద అమర వీరులకు ఆయన నివాళులర్పించారు. అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సీఎం నాటి ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో అనేక మంది పోరాటాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నట్లు కొనియాడారు. సాగునీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కరోనా కష్ట కాలంలోనూ నిరాటంకంగా కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక పరిశ్రమలు రానున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వానా కాలంలో అంటు వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, సీపీ రవీందర్, ఏసీపీ వెంకట లక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.