ఈ పేపర్ చదవండి.. పర్యావరణ ప్రేమికులుగా మారండి

దిశ, ముథోల్ :  ఈ పేపర్ చడవడం వలన అనేక ప్రయోజనాలు. అందులో ముఖ్యమైనది పర్యావరణం. మనం ఈ పేపర్ చదువుతూ పర్యావరణాన్ని కాపడవచ్చు.  అదేంటి ఈ- పేపర్ చదువుతూ… పర్యావరణాన్ని ఎలా కాపాడడం అనుకుంటున్నారా..! అవునండీ ఇది నిజం అదెలా అంటే..  మనం నిత్యం చదివే పేపర్లు కొన్ని వందల చెట్లు నరకడంతో తయారవుతుంది. అదే మన చేతిలో వుండే మొబైల్లో ఈ-పేపర్ చదవడంతో కొన్ని వందల చెట్లు నరకడం ఆగిపోతుంది. దీంతో  మనకు తెలియకుండానే […]

Update: 2021-04-06 00:29 GMT

దిశ, ముథోల్ : ఈ పేపర్ చడవడం వలన అనేక ప్రయోజనాలు. అందులో ముఖ్యమైనది పర్యావరణం. మనం ఈ పేపర్ చదువుతూ పర్యావరణాన్ని కాపడవచ్చు. అదేంటి ఈ- పేపర్ చదువుతూ… పర్యావరణాన్ని ఎలా కాపాడడం అనుకుంటున్నారా..! అవునండీ ఇది నిజం అదెలా అంటే.. మనం నిత్యం చదివే పేపర్లు కొన్ని వందల చెట్లు నరకడంతో తయారవుతుంది.

అదే మన చేతిలో వుండే మొబైల్లో ఈ-పేపర్ చదవడంతో కొన్ని వందల చెట్లు నరకడం ఆగిపోతుంది. దీంతో మనకు తెలియకుండానే మనం పర్యావరణాన్ని కాపాడే పర్యావరణ ప్రేమీకులం ఔతాం అంటూ.. బైంసా పట్టణానికి చెందినా ఓ పర్యావరణ ప్రేమికుడు తన ఆటోలో పోస్టర్ వేసుకొని అందులో ప్రయాణించే యువతను, ప్రజలను ఆలోచింప చేస్తున్నాడు. చెట్లు నాటడం వీలుకాకా పోయిన ఈ- పేపర్ చదవడం వల్ల మనకు తెలియకుండానే పర్యావరణ ప్రేమికులు గా మారవచ్చు అని ఆ యువకుడు తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నాడు.

Tags:    

Similar News