మార్కెట్ కొత్త పాలకమండలికి లైన్ క్లియర్.. ఎవరెవరికి ఏ పదవులు దక్కాయంటే..?
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలకమండలి కి లైన్ క్లియర్ అయింది. నాలుగు నెలల విరామం తర్వాత మార్కెట్ కమిటీ కొత్త పాలక మండలిని అధికారికంగా ప్రకటించింది. చైర్మన్ గా గుజ్జరి రాజు(జఫర్గడ్), వైస్ చైర్మన్ గా చల్ల చందర్ రెడ్డి(తానేదార్పల్లి), డైరెక్టర్లుగా తాటికాయల వరుణ్, పెంతల రాజ్ కుమార్, రంగు హరీష్, చల్లారపు శ్యాంసుందర్, చిగురు సరిత, జొన్నల సోమేశ్వర్, రాజన్ బాబులను […]
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలకమండలి కి లైన్ క్లియర్ అయింది. నాలుగు నెలల విరామం తర్వాత మార్కెట్ కమిటీ కొత్త పాలక మండలిని అధికారికంగా ప్రకటించింది. చైర్మన్ గా గుజ్జరి రాజు(జఫర్గడ్), వైస్ చైర్మన్ గా చల్ల చందర్ రెడ్డి(తానేదార్పల్లి), డైరెక్టర్లుగా తాటికాయల వరుణ్, పెంతల రాజ్ కుమార్, రంగు హరీష్, చల్లారపు శ్యాంసుందర్, చిగురు సరిత, జొన్నల సోమేశ్వర్, రాజన్ బాబులను నూతన పాలక మండలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాలుగు నెలల విరామం తర్వాత..
గత పాలకమండలి పదవీకాలం మే 28, 2021 తో ముగిసింది. నాటి నుంచి నేటి వరకు పలువురు నాయకులు మార్కెట్ చైర్మన్ పదవిని ఆశించినప్పటికి, కరోనా లాక్ డౌన్, రాజకీయ సమీకరణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగు నెలల విరామం తర్వాత నూతన పాలకమండలి ప్రకటించడం పట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నూతనోత్సాహం వచ్చింది.
పండగ తర్వాత ప్రమాణస్వీకారోత్సవం..
స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 11న లేదా దసరా పండగ తర్వాత నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే రాజయ్య కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను అందించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని నూతన చైర్మన్ గుజ్జరి రాజు దిశకు తెలిపారు. రైతులు పండించిన పంటలు మార్కెట్ కు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పొందాలని” ఆయన కోరారు.