క్వారంటైన్ నుంచి తప్పించుకుని వ్యక్తి ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలి.. ఎక్కడికి వెళ్లొద్దన్న నిబంధనను అమలు చేస్తున్న విషయం విధితమే. అయితే.. ఉత్తరప్రదేశ్ లో ఓ వలస కూలీ క్వారంటైన్ నుంచి తప్పించుకుని తన స్వగ్రామంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆ వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. గత నెల 23వ తేదీన ఓ వ్యక్తి గురుగ్రామ్ నుంచి తన […]

Update: 2020-04-02 02:14 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలి.. ఎక్కడికి వెళ్లొద్దన్న నిబంధనను అమలు చేస్తున్న విషయం విధితమే. అయితే.. ఉత్తరప్రదేశ్ లో ఓ వలస కూలీ క్వారంటైన్ నుంచి తప్పించుకుని తన స్వగ్రామంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆ వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. గత నెల 23వ తేదీన ఓ వ్యక్తి గురుగ్రామ్ నుంచి తన సొంత ఊరు లఖింపూర్ కు బయల్దేరాడు. లాక్ డౌన్ కొనసాగుతున్నందున అతడిని పోలీసులు క్వారంటైన్ లో ఉంచారు. అయితే, అతను క్వారంటైన్ నుంచి రెండు సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని అధికారులు అడ్డుకుని విషయం అర్థమయ్యేలే చెప్పారు. అయినా కూడా అతను క్వారంటైన్ నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వెళ్లి తన కుటుంబాన్ని కలిశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తూ ఆ వ్యక్తి ఊరికి వెళ్లారు. ఈ విషయం అతడికి తెలిసింది. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని అతను తన ఇంటి నుంచి పారిపోయి ఊరు శివారుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags: Uttar Pradesh, Migrant Worker, Suicide, Police, Quarantine

Tags:    

Similar News