ఓటేయ్యడానికి రాకు.. కరోనాతో ఖతమైపోకు

దిశ, వ‌రంగ‌ల్ : ఓటేయ్య‌డానికి పోకు- కరోనాతో ఖతమై పోకు అంటూ వ‌రంగ‌ల్ ఎంజీఎం ప్రాంగ‌ణంలో కోట శ్యాంకుమార్ అనే వ్య‌క్తి డాక్ట‌ర్ వేషాధార‌ణ‌లో ప్ల‌కార్డులు చేతబూని బుధ‌వారం నిర‌స‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా విజృంభిస్తున్న వేళ మిని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డంపై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, ప్రాణాల‌పై ఈ ప్రభుత్వానికి, ఎన్నిక‌ల సంఘానికి ఎంత‌మాత్రం ప‌ట్టింపులేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు 10 లక్షల మంది చనిపోయినా, ఎంత‌మాత్రం […]

Update: 2021-04-28 05:06 GMT

దిశ, వ‌రంగ‌ల్ : ఓటేయ్య‌డానికి పోకు- కరోనాతో ఖతమై పోకు అంటూ వ‌రంగ‌ల్ ఎంజీఎం ప్రాంగ‌ణంలో కోట శ్యాంకుమార్ అనే వ్య‌క్తి డాక్ట‌ర్ వేషాధార‌ణ‌లో ప్ల‌కార్డులు చేతబూని బుధ‌వారం నిర‌స‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా అత్యంత ప్ర‌మాద‌క‌రంగా విజృంభిస్తున్న వేళ మిని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డంపై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, ప్రాణాల‌పై ఈ ప్రభుత్వానికి, ఎన్నిక‌ల సంఘానికి ఎంత‌మాత్రం ప‌ట్టింపులేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు 10 లక్షల మంది చనిపోయినా, ఎంత‌మాత్రం ఏం కానట్లుగా ఉంటున్నాయి.. కానీ మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు.. మీ ప్రాణాలు మీ కుటుంబ స‌భ్యుల‌కు ఎంతో వేద‌న‌ను మిగుల్చుతాయి.. ఓటింగ్‌లో పాల్గొని క‌రోనాను అంటించుకోకండి. బాధ్య‌త‌లేని ప్ర‌భుత్వాల‌కు ఓటింగ్‌లో పాల్గొన‌కుండా నిర‌స‌న వ్య‌క్తం చేయండి అంటూ పిలుపునిస్తున్నాడు

 

Tags:    

Similar News