మరీ దారుణంగా ఉంది..

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సూర్యుడు ఉగ్రరూపం పసిపిల్లలకు, వృద్ధులకు నరక ప్రాయమైంది. కరోనా వైర‌స్ కార‌ణంగా గ‌త 45 రోజులు పాటు ఇంట్లోనే ఉండి ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌నాలు ఎండల‌ను త‌ట్టుకోలేక పోతున్నారు. వేసవి దెబ్బకు ప్రజలు మధ్యాహ్నం తరువాత ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోత, దాహార్తిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. […]

Update: 2020-05-24 02:33 GMT

దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సూర్యుడు ఉగ్రరూపం పసిపిల్లలకు, వృద్ధులకు నరక ప్రాయమైంది. కరోనా వైర‌స్ కార‌ణంగా గ‌త 45 రోజులు పాటు ఇంట్లోనే ఉండి ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌నాలు ఎండల‌ను త‌ట్టుకోలేక పోతున్నారు. వేసవి దెబ్బకు ప్రజలు మధ్యాహ్నం తరువాత ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోత, దాహార్తిని తీర్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఉదయం ఎనిమిది గంటలకే ఎండలు మండిపోతున్నాయి, గ‌త వారం రోజులుగా జిల్లాలో వ‌రుస‌గా 44, 43 డీగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడు అప్పుడప్పుడు ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది.

Tags:    

Similar News