విజృంభించిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ 205 ఆలౌట్

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత బౌలర్ల దాటికి చేతులెత్తేశారు. వచ్చినోళ్లు వచ్చినట్టుగానే పెవిలియన్‌ దారి పట్టారు. తాజాగా 75.5 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్(55) అర్థశతకంతో రాణించాడు. డాన్ లారెన్స్(46), ఓల్లీ పొప్(29), జానీ బెయిర్‌స్టో(28) […]

Update: 2021-03-04 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత బౌలర్ల దాటికి చేతులెత్తేశారు. వచ్చినోళ్లు వచ్చినట్టుగానే పెవిలియన్‌ దారి పట్టారు. తాజాగా 75.5 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో బెన్ స్టోక్స్(55) అర్థశతకంతో రాణించాడు. డాన్ లారెన్స్(46), ఓల్లీ పొప్(29), జానీ బెయిర్‌స్టో(28) పరుగులతో పర్వాలేదనిపించారు. ఓపెనర్లు క్రాలే(09), సిబ్లీ(02)తో పాటు సారథి రూట్(05) మరోసారి నిరాశపరిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మరోసారి బ్యాట్‌మెన్లకు చుక్కలు చూపించాడు. నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు కోలుకోని దెబ్బ తీశాడు. అలాగే మరో స్పిన్నర్ అశ్విన్ కూడా 3 వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్(02), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.

Tags:    

Similar News