వికలాంగులకూ కల్యాణలక్ష్మి : డైరెక్టర్

దిశ, తెలంగాణ బ్యూరో: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దివ్యాంగులకు కూడా వర్తిస్తాయని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి వికలాంగులను వివాహం చేసుకున్నందున ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వర్తించదని, వీటిలో ఏదో ఒకదాని ద్వారా మాత్రమే లబ్ధి పొందాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, ఈ రెండు పథకాలు ఒకదానితో మరొకటి సంబంధం లేనివని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం […]

Update: 2020-12-25 11:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు దివ్యాంగులకు కూడా వర్తిస్తాయని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి వికలాంగులను వివాహం చేసుకున్నందున ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వర్తించదని, వీటిలో ఏదో ఒకదాని ద్వారా మాత్రమే లబ్ధి పొందాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, ఈ రెండు పథకాలు ఒకదానితో మరొకటి సంబంధం లేనివని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 2014లో జారీ చేసిన ఉత్తర్వుల్లోనే నాల్గో పేరాలో స్పష్టత ఉందని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందినవారు వికలాంగులను వివాహం చేసుకుంటే లభించే ప్రోత్సాహంతో ముడిపెట్టరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ప్రభుత్వం పేర్కొన్నదని వివరించారు. అందువల్ల అన్ని జిల్లాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ రెండు పథకాలను ఒకటిగా జోడించి ఒకదాని కింద మాత్రమే లబ్ధి పొందేలా ఆంక్షలు విధించవద్దని ఆమె ఈ నెల 17న రాసిన లేఖలో స్పష్టం చేశారు.

Tags:    

Similar News