వీధి నాటకాలు వేస్తూ.. భార్య మర్మాంగాన్ని కోసి..
దిశ, వెబ్డెస్క్ : భార్యంటే భర్తలో సగభాగం. భర్త కష్టసుఖాల్లో సగం భరిస్తుంది భార్య. అలాంటి భార్యను నిండూ నూరేళ్లు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త.. అమానుష దుశ్చర్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో కనీవిని ఎరగని రీతిలో ఘాతుకానికి తెగపడ్డాడు. కాళ్లు, చేతులు కట్టేసి మర్మాంగాన్ని కోసి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణమూర్తిది చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చెంచుపాడు గ్రామ పరిధిలోని పాశంవారిపల్లె. […]
దిశ, వెబ్డెస్క్ : భార్యంటే భర్తలో సగభాగం. భర్త కష్టసుఖాల్లో సగం భరిస్తుంది భార్య. అలాంటి భార్యను నిండూ నూరేళ్లు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త.. అమానుష దుశ్చర్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో కనీవిని ఎరగని రీతిలో ఘాతుకానికి తెగపడ్డాడు. కాళ్లు, చేతులు కట్టేసి మర్మాంగాన్ని కోసి తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణమూర్తిది చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చెంచుపాడు గ్రామ పరిధిలోని పాశంవారిపల్లె. వీధి నాటకాలు వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య రాధ(35)పై కృష్ణమూర్తి అనుమానం పెంచుకున్నాడు. తను లేని సమయంలో తప్పుడు పనులకు పాల్పడుతుందని గత కొంతకాలంగా ఆమెను వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తరచూ రాధపై దాడి చేస్తూ చావబాదుతున్నాడు. గ్రామస్తులు ఎంత నచ్చ చెప్పినా అతడిలో మార్పు రావడం లేదు.
ఈ క్రమంలో గత నాలుగు రోజుల క్రితం భార్య రాధను నమ్మించి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేశాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టాడు. అనంతరం తప్పుడు పనులు చేస్తున్నావని తనవెంట తెచ్చుకన్న కత్తితో భార్య మర్మాంగాన్ని కోసేశాడు. ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అటుగా వెళ్లిన వారు రక్తపు మడుగులో పడి ఉన్న రాధను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి రాధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణమూర్తి ఇంత ఘాతుకానికి తెగపడుతాడా అంటూ గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.