పోలీసులపై మరిగే నూనె పోసిన హోటల్ యజమాని
దిశ, వెబ్ డెస్క్ : పోలీసులంటే ప్రజలలో ఏదో తెలియని భయం ఉంటుంది. ఇక లాక్ డౌన్ సమయంలో కాస్త బయటికి వెళ్దామన్నా.. అమ్మో ఎక్కడెక్కడ పోలీసులు ఆపుతారో అని భయపడుతుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా పోలీసులపైనే వేడి వేడిగా మరుగుతున్న నూనే పోశారు. అయితే ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. కరోనా కట్టడికి కోసం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. అయితే లాక్ డౌన్ సమయంలో ఎవరూ కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా ఉండేందుకు […]
దిశ, వెబ్ డెస్క్ : పోలీసులంటే ప్రజలలో ఏదో తెలియని భయం ఉంటుంది. ఇక లాక్ డౌన్ సమయంలో కాస్త బయటికి వెళ్దామన్నా.. అమ్మో ఎక్కడెక్కడ పోలీసులు ఆపుతారో అని భయపడుతుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా పోలీసులపైనే వేడి వేడిగా మరుగుతున్న నూనే పోశారు. అయితే ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.
కరోనా కట్టడికి కోసం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. అయితే లాక్ డౌన్ సమయంలో ఎవరూ కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా ఉండేందుకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని బాంకా స్థానిక శ్యామ్ బజార్‌లో కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నిర్ణీత సమయం తర్వాత కూడా కొన్ని దుకాణాలు తెరిచి ఉన్నాయి. దీంతో కొదరు వ్యక్తులు నిర్ణీత సమయం తర్వాత కూడా షాప్లు ఓపెన్ చేశారని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి హోటల్ మూసివేయాలని యజమానికి సూచించారు. దానికి ఆ హోటల్ యజమాని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు అనంతరం మరుగుతున్న నూనెను పోలీసులపై పోశాడు. ఈ ప్రమాదంలో పోలీస్ స్టేషన్ హెడ్ రాజ్‌కిశోర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయలయ్యాయి. ఆ తర్వాత కూడా హోటల్ యజమాని షాప్ ను మూసివేయలేదు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు.