ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
దిశ, రాయలసీమ : కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం ముగిశాయి. ఇందులో భాగంగా సీతారామ ఉత్సవ మూర్తులను యాగ శాలకు తీసుకొచ్చారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, ఉద్వాసనలు, కుంబప్రోక్షణ, మహానివేదన చేపట్టారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా ఉత్సవమూర్తుల ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్ వెంకటేష్, కంకణభట్టార్ రాజేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.