జగన్ నిర్ణయం చారిత్రాత్మకం : ఎన్ రామ్

         ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యపై తీసుకున్న నిర్ణయంపై పలువురు వ్యతిరేకించడంతో పాటు ఎక్కువ మంది అభినందించారు. ఈ నేపథ్యంలో ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్ కూడా జగన్‌ను అభినందించారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందించడం వంటి చారిత్రత్మకమైన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. బుధవారం విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’కార్యక్రమం నిర్వహించారు. […]

Update: 2020-02-05 01:20 GMT

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యపై తీసుకున్న నిర్ణయంపై పలువురు వ్యతిరేకించడంతో పాటు ఎక్కువ మంది అభినందించారు. ఈ నేపథ్యంలో ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్ కూడా జగన్‌ను అభినందించారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్య అందించడం వంటి చారిత్రత్మకమైన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. బుధవారం విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్లో ‘ది హిందూ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌ రామ్‌ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఇంగ్లీష్‌ మీడియంలో చదువు చెప్పడమే కాదు.. మొత్తం విద్యా వ్యవస్థలో మార్పులకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారని అన్నారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల బాధలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. సీఎం అయ్యాక వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులకు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు.

Tags:    

Similar News