టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఊరట.. హైకోర్టు కీలక ఉత్తర్వులు
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆమెపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల విచారణ చేపట్టి ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేయగా.. కింది కోర్టు […]
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆమెపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల విచారణ చేపట్టి ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేయగా.. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.