యోగా చేయండి..ఆరోగ్యంగా ఉండండి: గవర్నర్
దిశ ఏపీ బ్యూరో: యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, యోగా మన దేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమని తెలిపారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్‌ను అనుసరించి ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని […]
దిశ ఏపీ బ్యూరో: యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, యోగా మన దేశంలో ఐదువేల సంవత్సరాల క్రితమే ఉద్భవించిన పురాతన సాంప్రదాయమని తెలిపారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళతం చేస్తుందని అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్‌ను అనుసరించి ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ సూచనలతో ఐక్యరాజ్యసమితి 21 జూన్ 2015న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని చెప్పారు. యోగా కుటుంబాన్ని ఆరోగ్యాన్నిస్తుందని తెలిపారు.