ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే ఇప్పుడే ఎక్కువ!
దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ స్టేట్‌కు లిక్కర్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి కంటే ఎక్కువ ఆదాయం ఇప్పుడు వస్తోన్నది. ప్రభుత్వం కూడా మద్యం ఆదాయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఓ వైపు మద్యం కారణంగా అనేక అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మద్యం అధిక విక్రయాలపై ప్రణాళికలు రచిస్తోన్నది. ఎక్సైజ్ అధికారులకు ఏటా టార్గెట్లు నిర్దేశిస్తోన్నది. కరోనా మహమ్మారి కాలంలోనూ కట్టడికి విధించిన లాక్ డౌన్ తర్వాత ధరలు పెంచి మరీ విక్రయాలు సాగిస్తోన్నది. […]
దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ స్టేట్‌కు లిక్కర్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి కంటే ఎక్కువ ఆదాయం ఇప్పుడు వస్తోన్నది. ప్రభుత్వం కూడా మద్యం ఆదాయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఓ వైపు మద్యం కారణంగా అనేక అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మద్యం అధిక విక్రయాలపై ప్రణాళికలు రచిస్తోన్నది. ఎక్సైజ్ అధికారులకు ఏటా టార్గెట్లు నిర్దేశిస్తోన్నది. కరోనా మహమ్మారి కాలంలోనూ కట్టడికి విధించిన లాక్ డౌన్ తర్వాత ధరలు పెంచి మరీ విక్రయాలు సాగిస్తోన్నది. అయితే, అనేక క్రైమ్స్, అత్యాచారాలకు మద్యమే కారణమని పలు కేసులు నిరూపించాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం కూడా మద్యం కారణంగానే జరిగిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్య నియంత్రణ దిశగా చర్యలు తీసుకోకుండా ఎక్సైజ్ అధికారులపై ఆదాయం కోసం ఒత్తిడి పెంచడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లపై ప్రెజర్ చేయడం ద్వారా వారు గ్రామాలలో బెల్టు షాపులను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. మండల కేంద్రాల్లో మద్యం షాపుల యజమానులు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి గ్రామాల్లో, ఇతర కేంద్రాల్లో బెల్టు షాపులు పెట్టి అధిక ధరలకు విక్రయించి కాసులు దండుకుంటున్నారని తెలుస్తోన్నది.
ఉమ్మడి ఏపీ కంటే ఎక్కువ ఆదాయం
బెల్టుషాపులు అసలు లేవని చెబుతున్న ఎక్సైజ్ శాఖ అధికారుల మాటలు అసత్యాలన్న విషయం మద్యం కారణంగా నమోదైన కేసులను బట్టి తెలుస్తోన్నది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో ఫిబ్రవరి నెల వరకు 17,952 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లా పరిగి ఎస్‌హెచ్‌వోలో 8,233, మహబూబ్‌నగర్ జిల్లా 1,022, జగిత్యాలలో 783, రంగారెడ్డిలో 784, వనపర్తి 492, సంగారెడ్డి 889, కరీంనగర్ 722, సిద్దిపేట్ 419, మహబూబాబాద్ 354, జనగాం 511, వరంగల్ 481, సికింద్రాబాద్ 153, మెదక్ 462, నిజామాబాద్ 217, కొత్తగూడెం 496, మేడ్చల్ 280, పెద్దపల్లి 1,024 కేసులు నమోదయినట్లు అధికారుల సమాచారం. బెల్టుషాపులు లేవని చెబుతున్న ప్రభుత్వం ఇన్ని కేసుల నమోదు ఎలా చేసిందనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. ఉమ్మడి ఏపీలో 23 జిల్లాల్లో లిక్కర్‌తో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ఆదాయం అధికంగా ఉండటం గమనించదగిన విషయం. తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి పది జిల్లాలకు లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలిలా ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం రూ.(కోట్లలో)
2014-2015 10,803
2015-2016 12,706
2016-2017 14,184
2017-2018 17,597
2019 డిసెంబర్(30, 31 తేదీల్లో) 450
మొత్తంగా తెలంగాణలో లిక్కర్ విక్రయాలతో ప్రభుత్వానికి 65 శాతం ఆదాయం పెరగింది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులుండాలని సూచించింది. కానీ, అందుకు విరుద్ధంగా రహదారికి 100 మీటర్ల దూరంలో షాపులకు ప్రభుత్వ అనుమతివ్వడం బాధ్యతా రాహిత్యమని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మద్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.