పెద్దగట్టు జాతరకు నిధులు మంజూరు..

దిశ, సూర్యాపేట: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దగట్టు జాతర వచ్చే నెల(ఫిబ్రవరి) 28 నుంచి మార్చి 04వ తేదీ వరకూ నిర్వహించాలని పూజారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో రెండో అతిపెద్దగా గుర్తించబడిన పెద్దగట్టు జాతర ప్రతి […]

Update: 2021-01-05 09:42 GMT

దిశ, సూర్యాపేట: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దగట్టు జాతర వచ్చే నెల(ఫిబ్రవరి) 28 నుంచి మార్చి 04వ తేదీ వరకూ నిర్వహించాలని పూజారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో రెండో అతిపెద్దగా గుర్తించబడిన పెద్దగట్టు జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిగా వచ్చే భక్తులతో దూరాజ్‌పల్లిలోని పెద్ద గట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తుంది. అలాంటి జాతర దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్దగట్టు జాతర ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

Tags:    

Similar News