దిశ ఎఫెక్ట్.. కంపా కొల్లేరుతో కంపించిన అటవీశాఖ
దిశ ప్రతినిధి, వరంగల్: అటవీ శాఖలో జరుగుతున్న అవినీతిపై కంపా కొల్లేరు శీర్షికన దిశలో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. హరితహారం పనులకు మంజూరైన నిధుల్లో 15 శాతం చొప్పున జరుగుతున్న దోపిడీని ‘దిశ’ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథనం శాఖ ఉన్నతాధికారులను ఉలిక్కిపడేలా చేసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ పరిధిలోని మంజూరైన రూ.45 లక్షల్లో అధికారి అమృత 15 శాతం తన వాటా కట్ చేసుకుని మిగతా మొత్తం సెక్షన్ […]
దిశ ప్రతినిధి, వరంగల్: అటవీ శాఖలో జరుగుతున్న అవినీతిపై కంపా కొల్లేరు శీర్షికన దిశలో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. హరితహారం పనులకు మంజూరైన నిధుల్లో 15 శాతం చొప్పున జరుగుతున్న దోపిడీని ‘దిశ’ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథనం శాఖ ఉన్నతాధికారులను ఉలిక్కిపడేలా చేసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ పరిధిలోని మంజూరైన రూ.45 లక్షల్లో అధికారి అమృత 15 శాతం తన వాటా కట్ చేసుకుని మిగతా మొత్తం సెక్షన్ అధికారుల ఖాతాలకు బదిలీ చేసింది. అటవీ పనులకు మంజురైన నిధులను ఇంత యథేచ్ఛగా దోపిడీ చేయడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఉన్నతాధికారుల పేరు చెప్పి నిధుల కాజేసిన గూడూరు ఎఫ్ఆర్వోపై ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దిశలో వచ్చిన కథనంపై పీసీసీఎఫ్ శోభ, విజిలెన్స్ పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్ భీమానాయక్, మహబూబాబాద్ జిల్లా డీఎఫ్‌వో రవికిరణ్ లు ఆరా తీసినట్లు సమాచారం. విజిలెన్స్ పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్‌ను దిశ వివరణ కోరగా..దిశలో వచ్చిన కథనాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఖచ్చితంగా విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. శాఖపరంగా, మిగతా ఉద్యోగులను విచారిస్తామని చెప్పారు. విచారణ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.