బెంగాల్, అసోంలో ప్రారంభమైన తొలివిడత పోలింగ్
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు కడుతున్నారు. అసోంలో 47, బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ పోలింగ్ ప్రకృయ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు కడుతున్నారు. అసోంలో 47, బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ పోలింగ్ ప్రకృయ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు తొలివిడత ఓటింగ్ జరుగుతుండగా.. బెంగాల్‌లో 8 విడతల ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.