ట్రాన్స్ ఫార్మర్ బంద్ చేయబోయి విగత జీవుడైన రైతు

దిశ, మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ బంద్ చేయబోయి, విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రైతు బొమ్మగాని అంతయ్య(50) ఉదయం ఎనిమిది గంటలకు పొలం వద్ద విద్యుత్ మోటార్ పనిచేయడం లేదని బంద్ చేయడానికి వెళ్లాడు. అయితే, దానికి ఎక్స్ ఫ్యూజ్ అమర్చని కారణంగా ఆన్-ఆఫ్ స్విచ్‌కు విద్యుత్ సరఫరా […]

Update: 2021-08-13 05:33 GMT

దిశ, మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ ఫార్మర్ బంద్ చేయబోయి, విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన రైతు బొమ్మగాని అంతయ్య(50) ఉదయం ఎనిమిది గంటలకు పొలం వద్ద విద్యుత్ మోటార్ పనిచేయడం లేదని బంద్ చేయడానికి వెళ్లాడు. అయితే, దానికి ఎక్స్ ఫ్యూజ్ అమర్చని కారణంగా ఆన్-ఆఫ్ స్విచ్‌కు విద్యుత్ సరఫరా జరుగుతుందని అంతయ్య గమనించకుండా పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. గమనించిన స్థానిక పొలాల రైతు నిమ్మల భద్రయ్య గ్రామస్తులకు సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన గ్రామస్తులు పొలానికి వచ్చి శవాన్ని తీసుకొని అడ్డగూడూరు చౌరస్తాలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రైతు మరణానికి కారణమైన విద్యుత్ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించాలని, ఎమ్మెల్యే స్పందించి రైతు కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం పరిహారం ఇవ్వాలని భీష్మించుకుని కూర్చున్నారు. సరైన ప్రమాణాలు పాటించకుండా విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం రైతు ప్రాణాల మీదకు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News