ముద్దు సీన్లు సహజంగా రావాలని ఆ సిరీస్ లు చూశాను- నటి
దిశ, వెబ్డెస్క్: అష్లేషా ఠాకూర్.. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’ ధృతి అని చెప్పండి.. టక్కున ఓ ఆ టీనేజ్ పాపనా అనేస్తారు. ఆ సిరీస్ లో మనోజ్ బాజ్పేయి టీనేజ్ కుమార్తెగా అష్లేషా నటన అద్భుతంగా ఉందని ప్రసంశలు అందుకుంది. మొదటి సీజన్ లో ఈమె క్యారెక్టర్ నార్మల్ గా ఉన్నా రెండో సీజన్ లో ఒక టీనేజర్ గా కనిపించింది. ఇక అభయ్ వర్మతో ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి […]
దిశ, వెబ్డెస్క్: అష్లేషా ఠాకూర్.. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’ ధృతి అని చెప్పండి.. టక్కున ఓ ఆ టీనేజ్ పాపనా అనేస్తారు. ఆ సిరీస్ లో మనోజ్ బాజ్పేయి టీనేజ్ కుమార్తెగా అష్లేషా నటన అద్భుతంగా ఉందని ప్రసంశలు అందుకుంది. మొదటి సీజన్ లో ఈమె క్యారెక్టర్ నార్మల్ గా ఉన్నా రెండో సీజన్ లో ఒక టీనేజర్ గా కనిపించింది. ఇక అభయ్ వర్మతో ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిన అష్లేషా ఆ సీన్స్ కోసం చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అష్లేషా మాట్లాడుతూ ” రెండో సీజన్ లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. మొదట ముద్దు సన్నివేశం చేయడం ఎంతో ఇబ్బంది అనిపించింది. ఇది నాకు కొత్త.. ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం సరదా కాదు. అందుఎక్ ముద్దు సన్నివేశం సహజంగా రావాలని.. అలాంటి సీన్లు ఉన్న వెబ్ సిరీస్ లు చూశాను. ముద్దు సన్నివేశాన్ని సాంకేతికంగానే చిత్రీకరించినప్పటికీ నాకు చాలా నెర్వస్ గానే అనిపించింది. కానీ ఒక నటిగా సన్నివేశానికి న్యాయం చేయాలి కాబట్టి ప్రయత్నించాను. అంతేకాకండా నేను నా దర్శకులను నమ్మాను. ఆ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో దాని గురించి చింతించలేదు. ఎందుకంటే వారు కథ విషయంలో ఎంత పర్ఫెక్ట్ అన్న విషయం నాకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ తో అష్లేషా కు మంచి పేరు రావడంతో పాటు మంచి అవకాశాలు కూడా క్యూ కట్టాయి.