13 నెలల్లో మూడు సార్లు కరోనా బారినపడ్డ డాక్టర్ హల్లరి

ముంబై: కొత్త వేరియంట్లను నిలువరించే టీకా సామర్థ్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ముంబైకి చెందిన 26ఏళ్ల డాక్టర్ శ్రిష్టి హల్లరి రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా రెండు సార్లు కరోనాబారిన పడటం చర్చనీయాంశమైంది. 13 నెలల్లో ఆమెకు మూడు సార్లు వైరస్ సోకింది. తొలి రెండు సార్లు ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూడోసారి అదీ రెండు డోసులు తీసుకున్న తర్వాతా హాస్పిటల్‌లో అడ్మిట్ కావల్సి వచ్చింది. ఉపశమనం కోసం రెమ్‌డెసివిర్ వేసుకోక తప్పలేదు. ముంబైలోని వీర్ […]

Update: 2021-07-27 08:19 GMT

ముంబై: కొత్త వేరియంట్లను నిలువరించే టీకా సామర్థ్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ముంబైకి చెందిన 26ఏళ్ల డాక్టర్ శ్రిష్టి హల్లరి రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా రెండు సార్లు కరోనాబారిన పడటం చర్చనీయాంశమైంది. 13 నెలల్లో ఆమెకు మూడు సార్లు వైరస్ సోకింది. తొలి రెండు సార్లు ఇన్ఫెక్షన్ సాధారణంగా ఉన్నప్పటికీ, మూడోసారి అదీ రెండు డోసులు తీసుకున్న తర్వాతా హాస్పిటల్‌లో అడ్మిట్ కావల్సి వచ్చింది. ఉపశమనం కోసం రెమ్‌డెసివిర్ వేసుకోక తప్పలేదు. ముంబైలోని వీర్ సావర్కర్ హాస్పిటల్‌లో కొవిడ్ డ్యూటీ చేస్తున్న డాక్టర్ హల్లరికి గతేడాది జులై 17న తొలిసారి కరోనా సోకింది. అప్పుడు ఆమెలో సాధారణ లక్షణాలే కనిపించాయి. ఈ ఏడాది మార్చి 8న తొలి డోసు, ఏప్రిల్ 29న రెండో డోసు తీసుకున్నారు.

అయినప్పటికీ, నెల రోజుల తర్వాత మే 29న రెండో సారి కరోనా బారినపడ్డట్టు రిపోర్ట్స్ వెల్లడించాయి. సింప్టమ్స్ మైల్డ్‌గానే ఉండటంతో ఇంట్లోనే కోలుకున్నారు. జులై 11న మరోసారి మొత్తం కుటుంబా(తల్లి, తండ్రి, సోదరుడు)నికి వైరస్ సోకింది. ఈ సారి వారి ఆరోగ్య పరిస్థితులు దిగజారాయి. వారందరికీ రెమ్‌డెసివిర్ ఇవ్వాల్సి వచ్చింది. వారి రక్తంలో కొవిడ్ యాంటీబాడీలున్నట్టు ఫలితాలు వెల్లడించాయని వైద్యులు తెలిపారు. టీకాలు ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోకున్నా ఆరోగ్యం దిగజారకుండా కాపాడుతాయని నిపుణులు పలుసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కనీసం ఒక డోసు అయినా తీసుకుని కరోనా బారిన పడ్డ 677 మందిలో 67 మందికి హాస్పిటలైజేషన్ అవసరం పడిందని, ముగ్గురు మరణించారని ఐసీఎంఆర్ నిధులు సమకూర్చిన ఓ అధ్యయనం ఇటీవలే పేర్కొనడం గమనార్హం.

Tags:    

Similar News