‘విదేశీ సాయం ప్రజలకు పంచడానికి.. తుప్పు పట్టించడానికి కాదు’
న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభంతో భారత్ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వివిధ దేశాలు చేస్తున్న వైద్య పరికరాలు, ఇతర సాయం ప్రజలకు పంచాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది. విదేశీ సాయాన్ని ప్రజలకు పంచాలే గానీ డబ్బాల్లో నిల్వ ఉంచి వాటిని వ్యర్థంగా మార్చడానికి కాదని తెలిపింది. విదేశాల నుంచి కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వం అందుకున్న సాయం నిరూపయోగంగా మారిందని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన సీనియర్ అడ్వకేట్ రాజశేఖర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు […]
న్యూఢిల్లీ : కొవిడ్ సంక్షోభంతో భారత్ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో వివిధ దేశాలు చేస్తున్న వైద్య పరికరాలు, ఇతర సాయం ప్రజలకు పంచాలని ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు సూచించింది. విదేశీ సాయాన్ని ప్రజలకు పంచాలే గానీ డబ్బాల్లో నిల్వ ఉంచి వాటిని వ్యర్థంగా మార్చడానికి కాదని తెలిపింది. విదేశాల నుంచి కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వం అందుకున్న సాయం నిరూపయోగంగా మారిందని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన సీనియర్ అడ్వకేట్ రాజశేఖర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీకి విదేశాల నుంచి వందలాదిగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందాయని, అందులో ఒక మెడికల్ కాలేజీలో అవసరం లేకున్నా 260 ఉంచారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లిల ధర్మాసనం స్పందిస్తూ… ‘విదేశాల నుంచి అందుతున్న వైద్య పరికరాలు, ఇతర సాయం ప్రజలకు చేర్చాలి. దానిని వారి అవసరాల కోసం వినియోగించాలి. అంతేగానీ వాటిని డబ్బాల్లో దాచిపెట్టి పాడయ్యేలా చేయకూడదు’ అని తెలిపింది. విదేశీ సాయాన్ని ప్రజలకు చేర్చడానికి గురుద్వారాలను, ఎన్జీవోలను వాడుకోవాలని కోర్టు సూచించింది.