భారత్ లో తగ్గిన కరోనా.. కొత్త కేసులెన్నంటే..?
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొద్దిమేర నిదానించింది. గడచిన 24 గంటల్లో 2,22,315 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,02,544 మంది కరోనా నుండి కోలుకోగా.. 4,454మంది మృతిచెందారు. ఇక భారత్ లో ఇప్పటివరకు 19.60 కోట్లకు పైగా వ్యాక్సినేషన్స్ వేయించుకున్నారు. ముందటితో పోలిస్తే కరోనా మరణాలు కొంతవరకు తగ్గాయనే చెప్పాలి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ ప్రభావం వలన కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొండిగా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొద్దిమేర నిదానించింది. గడచిన 24 గంటల్లో 2,22,315 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,02,544 మంది కరోనా నుండి కోలుకోగా.. 4,454మంది మృతిచెందారు. ఇక భారత్ లో ఇప్పటివరకు 19.60 కోట్లకు పైగా వ్యాక్సినేషన్స్ వేయించుకున్నారు. ముందటితో పోలిస్తే కరోనా మరణాలు కొంతవరకు తగ్గాయనే చెప్పాలి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ ప్రభావం వలన కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొండిగా సాగుతుంది. వ్యాక్సిన్ స్టాక్ లేకపోవడం వలన ఫస్ట్ డోస్ తీసుకున్నవారు సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.