కూతురే కొడుకైన వేళ.. తండ్రికి తలకొరివి పెట్టిన వైనం
దిశ, ఏపీ బ్యూరో: తండ్రి కరోనాతో పోరాడి చనిపోయాడు. అంత్యక్రియలకు ఇతరులు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం బంధువులు సైతం ముఖం చాటేశారు. దీంతో చేసేది లేక కూతురే తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. తండ్రికి తలకొరివి పెడుతూ బోరున విలపించింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడ్ల శ్రీనివాసరావు కరోనాకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గుడ్ల శ్రీనివాసరావు […]
దిశ, ఏపీ బ్యూరో: తండ్రి కరోనాతో పోరాడి చనిపోయాడు. అంత్యక్రియలకు ఇతరులు ఎవరూ ముందుకు రాలేదు. కనీసం బంధువులు సైతం ముఖం చాటేశారు. దీంతో చేసేది లేక కూతురే తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. తండ్రికి తలకొరివి పెడుతూ బోరున విలపించింది. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన గుడ్ల శ్రీనివాసరావు కరోనాకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గుడ్ల శ్రీనివాసరావు కుమార్తె తలకొరివి పెట్టింది.