కిలాడీ జంట.. ఆ పని చేస్తామని రూ.10 కోట్లు వసూలు
దిశ, ఏపీ బ్యూరో : అమెరికాలో ఎఫ్1 వీసాతో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను కన్సల్టెన్సీ పేరుతో ఓ కిలాడీ జంట నిలువునా మోసం చేసింది. విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామని ముత్యాల సునీల్, ప్రణీత కోట్లు దండుకున్న ఘటన వెలుగు చూసింది. సుమారు 30 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ. 10 కోట్ల దాకా వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి 25 వేల డాలర్లు ఇచ్చినట్లు వాపోయారు. తమను మోసం చేసిన వారిపై అమెరికా […]
దిశ, ఏపీ బ్యూరో : అమెరికాలో ఎఫ్1 వీసాతో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను కన్సల్టెన్సీ పేరుతో ఓ కిలాడీ జంట నిలువునా మోసం చేసింది. విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామని ముత్యాల సునీల్, ప్రణీత కోట్లు దండుకున్న ఘటన వెలుగు చూసింది. సుమారు 30 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ. 10 కోట్ల దాకా వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి 25 వేల డాలర్లు ఇచ్చినట్లు వాపోయారు. తమను మోసం చేసిన వారిపై అమెరికా నార్త్‌కరోలినా హోంల్యాండ్ సెక్యూరిటీలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థులను మోసం చేసిన ముత్యాల సునీల్, ప్రణీత పరారయ్యారు. యూరప్ వెళ్లిపోయినట్లు తెలిసింది. వీళ్లపై ఇంటర్‌పోల్ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల నుంచి దండుకున్న సొమ్మును సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టిన ముత్యాల సత్యనారాయణ కూడా పరారయ్యాడు.