వామ్మో ఒకే స్కూల్లో ఇన్ని కేసులా.. చాపకింద నీరులా ఒమిక్రాన్..
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం మొత్తానికి ఇప్పడు ఒమిక్రాన్ సవాలు విసురుతోంది. ఒక వైపు కరోనా మరో వైపు ఒమిక్రాన్ అక్కడక్కడా కొత్త వేరియంట్లు.. ఇలా ప్రపంచం మొత్తం అతలా కుతలం అవుతోంది. మన దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అది కూడా చిన్న పిల్లల మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే అది నిజమనే తెలుస్తోంది. స్కూల్ పిల్లల పై దాని ప్రభావం మెల్లిగా […]
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం మొత్తానికి ఇప్పడు ఒమిక్రాన్ సవాలు విసురుతోంది. ఒక వైపు కరోనా మరో వైపు ఒమిక్రాన్ అక్కడక్కడా కొత్త వేరియంట్లు.. ఇలా ప్రపంచం మొత్తం అతలా కుతలం అవుతోంది. మన దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అది కూడా చిన్న పిల్లల మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే అది నిజమనే తెలుస్తోంది. స్కూల్ పిల్లల పై దాని ప్రభావం మెల్లిగా పెరుగుతోంది. నయా ముంబాయ్ లో ఒకే పాఠశాలకు చెందిన 16 మంది పిల్లలు తాజాగా కరోనా బారిన పడ్డారు.
థన్సోలీలోని గొతివలి షెట్కారి శిక్షణ సంస్థ పాఠశాలలోని ఓ విద్యార్థి తండ్రి ఖతార్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఇతనికి నెగటివ్ వచ్చినా.. కుటుంబంలోని పిల్లవాడికి మాత్రం పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మహారాష్ట్రాలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ క్రియాశీల కేసుల సంఖ్య పది వేలకు పైగానే ఉంది. ఒక్క మహారాష్ట్రాలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40 దాటడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో ముంబాయ్ ప్రజలు భయం గుప్పెట్లో బతుకు సాగిస్తున్నారు.