Kishan Reddy: ఆరు గ్యారెంటీలపై అప్ డేట్ ఏమైనా ఉందా?.. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి ప్రశ్న

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన వేళ కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.

Update: 2024-11-05 09:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ అప్ డేట్ కోసం యావత్ తెలంగాణ ఆసక్తితో ఎదురు చూస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు (six guarantees), 400 హామీలు ఏమయ్యాయో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్టును పెట్టారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, కౌలు రైతులకు రూ.15 వేలు, రోజువారీ కూలీలకు రూ. 12 వేలు, కొత్తగా పెళ్లైన వధువులకు కల్యాణ లక్ష్మి కిందా తులం బంగారం వంటి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విస్మరించిందని ధ్వజమెత్తారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ రూ. 15,376 కోట్ల పంట రుణాల మాఫీలో 16 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. ఈ హామీల అమలు సంగతి ఏమైందో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తారా అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News