'గాలిలో కరోనా 10 మీటర్లు వెళ్లగలదు'

న్యూఢిల్లీ: కరోనా వైరస్ గాలిలో 10 మీటర్లు ప్రయాణించగలదని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్ రాఘవన్ కార్యాలయం తెలిపింది. కాబట్టి నివాసాలు, పనిప్రాంతాలు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్ మెయింటెయిన్ చేయాలని, సరైన వెంటిలేషనే దీనికి మెరుగైన విరుగుడు అని పేర్కొంది. బయటి గాలి లోపలకు వచ్చేలా వెంటిలేషన్ సరైన విధంగా, సరైన వైపున ఏర్పాటు చేయాలని తెలిపింది. సెంట్రల్ ఏసీలతో డోర్లు, కిటికీలు మూసి ఉండే కార్యాలయాల్లో వైరల్ లోడ్ ఎక్కువ ఉండే […]

Update: 2021-05-20 06:30 GMT

న్యూఢిల్లీ: కరోనా వైరస్ గాలిలో 10 మీటర్లు ప్రయాణించగలదని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కే విజయ్ రాఘవన్ కార్యాలయం తెలిపింది. కాబట్టి నివాసాలు, పనిప్రాంతాలు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్ మెయింటెయిన్ చేయాలని, సరైన వెంటిలేషనే దీనికి మెరుగైన విరుగుడు అని పేర్కొంది. బయటి గాలి లోపలకు వచ్చేలా వెంటిలేషన్ సరైన విధంగా, సరైన వైపున ఏర్పాటు చేయాలని తెలిపింది. సెంట్రల్ ఏసీలతో డోర్లు, కిటికీలు మూసి ఉండే కార్యాలయాల్లో వైరల్ లోడ్ ఎక్కువ ఉండే ముప్పు ఉన్నదని, వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజాగా విడుదల చేసిన గైడ్‌లైన్స్‌లో వివరించింది. అందుకే గ్యాబుల్ ఫ్యాన్లు వాడాలని, షాపింగ్ మాల్స్, ఆడిటోరియంలు, ఇతర పబ్లిక్ ప్లేసుల్లో రూఫ్ వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని తెలిపింది.

కరోనా సోకిన వారి నుంచి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు, పాడినప్పుడు తుంపర్లు రూపంలో బయటికి వచ్చి ఇతరులకు సోకే అవకాశాలు ఎక్కువ అని వివరించింది. కరోనా లక్షణాలు కనిపించనివారితోనూ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తు్న్నదని పేర్కొంది. కాబట్టి ప్రతిఒక్కరు తప్పకుండా మాస్కు ధరించాలని, డబుల్ మాస్క్ లేదా ఎన్ 95 మాస్కు ధరించడం మరింత శ్రేయస్కరమని తెలిపింది.

Tags:    

Similar News