ఇవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు
దిశ చేవెళ్ల: ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం శుక్రవారం చేవెళ్ల యాత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ యాత్ అధ్యక్షులు పెంటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష విధానం పై గత పది రోజులుగా విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారన్నారు. మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. […]
దిశ చేవెళ్ల: ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం శుక్రవారం చేవెళ్ల యాత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ యాత్ అధ్యక్షులు పెంటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష విధానం పై గత పది రోజులుగా విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారన్నారు.
మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అందరిని ప్రభుత్వం పాస్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఇవి విద్యార్థుల ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలు అన్నారు.
ఈ కార్యక్రమంలో షాబాద్ మండల్ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, నియోజకవర్గం యాత్ కాంగ్రెస్ కార్యదర్శి సుశాంత్, NSUI నేషనల్ కోర్డినేటర్ కరుణకార్ రెడ్డి, మండల్ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్, మధు, శివ, కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.