బైక్‌పై వెళ్లి.. పంచాయితీ తెంపిన కలెక్టర్

దిశ, మునగాల: అభివృద్ధి పనులు నిలిపి వేయబడి, వివాదస్పదంగా మారిన సూర్యాపేట జిల్లా తిమ్మారెడ్డి గూడెం గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ముందుగా మునగాల మండల కేంద్రంలోని ఉప్పుల యుగంధర్ రెడ్డి పంట పొలాల వద్దకు బైకుపై వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామంలోని వివాదాస్పద […]

Update: 2021-03-18 06:50 GMT

దిశ, మునగాల: అభివృద్ధి పనులు నిలిపి వేయబడి, వివాదస్పదంగా మారిన సూర్యాపేట జిల్లా తిమ్మారెడ్డి గూడెం గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. ముందుగా మునగాల మండల కేంద్రంలోని ఉప్పుల యుగంధర్ రెడ్డి పంట పొలాల వద్దకు బైకుపై వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ సందర్భంగా వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామంలోని వివాదాస్పద డంపింగ్ యార్డు స్థలాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పచ్చదనం కోసం పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను ప్రవేశ ఏర్పాటు చేసిందని అన్నారు.

తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో వివాదాస్పదంగా మారిన డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం సమస్యను గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరించామని, గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరూ తప్పక సహకరించాలని సూచించారు. ఆ తర్వాత మునగాల మండల కేంద్రంలోని ఉప్పుల యుగంధర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన పంట కల్లాలను పరిశీలించారు. ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.85 వేలు అందజేస్తోందని, దీనిని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్వేయర్ సరిత, మునగాల తిమ్మారెడ్డి గూడెం గ్రామాల సర్పంచులు చింతకాయల ఉపేందర్, బూషిపల్లి శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, తదితర రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News